అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఆముదాలకుంట వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ఘటనలో 12 ఏళ్ల బాలుడు సహా మరో వ్యక్తి మృతి చెందాడు. ఇంకొకరు గాయపడ్డారు. చెర్లోపల్లికి చెందిన సతీశ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి, సాయి అనే బాలుడు బైక్పై వెళ్తుండగా.. ఆటో ఢీకొంది.
ఈ ఘటనలో సాయి అక్కడికక్కడే మరణించగా.. సతీశ్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసులు అనే మరో యువకుడు గాయపడ్డాడు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.