అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పలు ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్ ప్రకటించారు. ఇటీవల కళ్యాణదుర్గం పట్టణంలో కరోనా కేసులు అధికంగా ఉండటంతో అధికారులు కట్టడి చర్యలు చేపట్టారు. తాజాగా కోటవీధిని, నిత్యం రద్దీగా ఉండే మేడ వీధిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆ వీధిలోకి వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 11 వరకే పట్టణంలో అన్ని దుకాణాలు తెరవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు పట్టణ వాసులను హెచ్చరించారు. అత్యవసరమైతేనే వీధులులోకి రావాలని, పట్టణంలోకి అవసరం లేకుండా రాకూడదని అధికారులు కోరారు.
కళ్యాణదుర్గంలో పలు ప్రాంతాల్లో రెడ్ జోన్ ఆంక్షలు..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలను అధికారలు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఉదయం 11 లోపే అన్ని దుకాణాలు మూసివేయాలని, లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దుర్గంలో పలు ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటించిన అధికారులు..