అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో వేలాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది. గతంలో ఓబిగానిపల్లి గ్రామం వాటర్‌షెడ్ పరిధిలో నిర్మించిన ఏడు చెక్‌డ్యాంల పరిసరాల్లో మొక్కలు నాటారు. వర్షాలు మొదలవ్వడంతో చెక్ డ్యాం గట్ల వెంట పరిసర ప్రాంతాలు కోతకు గురికాకుండా కలబంద, సీతాఫలం వంటి ముక్కలతో పాటు వేప, కానుగ చెట్లను నాటుతున్నారు. సెక్టార్ టీం లీడర్ నరసింహులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఎక్కడ ఏ మొక్కలు నాటాలో రైతులకు సూచిస్తున్నారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు సంస్థ ప్రతినిధులను అభినందించారు. గ్రామ పరిధిలోని రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మొక్కలు నాటుతూ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు.
మొక్కలు నాటిన ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో వేలాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ. చెక్ డ్యాం గట్ల వెంట పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు.
మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన ఆర్డిటి
TAGGED:
rdt started planting program