అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో నాటుసారా తయారీ చేస్తున్న ఆరు స్థావరాలలపై డీఎస్పీ ఖాసీంసాబ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 3600 లీటర్ల బెల్లం ఊటతోపాటు 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ రామమోహన్ పాల్గొని గుండాల తాండాలోని ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు సార్లు పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు.
3600 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం - ananthapuram district latest crime news
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాల తాండ గ్రామ శివారులో అక్రమంగా తయారీ చేస్తున్న నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. 3600 లీటర్ల బెల్లం ఊటతోపాటు 80 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఏఎస్పీ రామమోహన్ వెల్లడించారు.
నాటుసారా బట్టీలపై ఎస్ఈబీ దాడులు
మొత్తం 16,000 కేజీల బెల్లం... 80,000 లీటర్ల సారా ఊట, 4500 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 3000 మందిని బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఇసుక అక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు 85 కేసులు నమోదుచేసి, 800 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై షీట్ ఓపెన్ చేసి... అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.