అనంతపురం జిల్లా మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ల వద్ద నున్న వేయింగ్ మిషన్లకు అధికారులు సీల్ వేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మార్వోను కోరారు. తమకు ప్రతి నెల కందిపప్పు సరిగా ఇవ్వడం లేదని మొరపెట్టుకున్నారు. స్టాక్ పాయింట్లో ఆర్వో చూపిన విధంగా తమకు సరుకులు ఇవ్వడం లేదని చెప్పారు. ప్రతి బియ్యపు సంచిలో తూకాలు తక్కువ వస్తున్నాయని డీలర్లు ఆరోపించారు. మడకశిర పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కందిపప్పు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టాక్ పాయింట్ల వద్ద నుంచి డీలర్లు తమ వస్తువులను అక్కడే సరిచూసుకుని తీసుకురావాలని ఎమ్మార్వో సూచించారు. ఒకవేళ అక్కడే సమస్యలు తలెత్తితే సరుకులను తీసుకోకుండా సమస్యను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు.
రేషన్ వేయింగ్ మిషన్లకు సీల్ వేసిన అధికారులు
అనంతపురం జిల్లా మడకశిర తహశీల్దార్ కార్యాలయంలో తూనికలు కొలతల అధికారులు... రేషన్ డీలర్ల వద్ద గల వేయింగ్ మిషన్లను తనిఖీ చేశారు.
ration waighing machine sealed officers in ananthapuram district