అనంతపురం పట్టణంలో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. 720 బియ్యం బస్తాలను పట్టుకున్నామని పేర్కొన్నారు. లారీలో 50 కేజీల 660 బియ్యం ప్యాకెట్లు, గోడౌన్లో 60 ప్యాకెట్లు గుర్తించామన్నారు.
720 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - ration rice seized news
అనంతపురం పట్టణంలో భారీగా రేషన్ బియ్యాన్ని రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్నారనే సమాచారం అందటంతో దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు.
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
దీనికి సంబంధించి నలుగురు వ్యక్తుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తం బియ్యాన్ని లారీలో బెంగుళూరుకు తరలిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి పంపిస్తామని తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:TDP committee: హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా కమిటీ ఖరారు