ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్రలేఖనంలో చేయితిరిగిన రాప్తాడు చిన్నారులు..!

ఖరీదైన రంగులు కొనే స్థోమత లేదు. ప్రత్యేక శిక్షణ తీసుకునే స్థాయీ లేదు. ప్రోత్సహించే వారూ లేరు. అయితేనేం.. వారి ప్రతిభ ముందు పేదరికం తలవంచింది. ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా.. ఎలాంటి ప్రోత్సాహం లేకపోయినా.. చిల్లర డబ్బులతో పెయింటింగ్ స్కెచ్​లు, పేపర్లు కొనుగోలు చేసి అద్భుత చిత్రాలు గీస్తున్నారు అనంతపురం జిల్లా రాప్తాడు ఆదర్శ పాఠశాల విద్యార్థులు.

rapathadu mandal adharsh school student paintings at ananthapuram
చిత్రలేఖనంలో చేయితిరిగిన కుర్రాడు..

By

Published : Jan 29, 2020, 7:50 AM IST

చిత్రలేఖనంలో చేయితిరిగిన రాప్తాడు చిన్నారులు..!

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఆదర్శ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. టీవీల్లో, పత్రికల్లో వచ్చే చిత్రాలు చూసి సొంతంగా గీస్తున్నారు. వారిని చూస్తే ఎంత చేయితిరిగిన కళాకారులో అని అందరూ అనుకుంటారు. ఆ అభినవ ఏకలవ్యులు చదువుతోపాటు కొంత సమయాన్ని చిత్రలేఖనానికి కేటాయిస్తూ... చక్కని చిత్రాలు వేస్తున్నారు.

రాప్తాడుకు చెందిన కౌసర్​బేగం టీ కొట్టు నిర్వహిస్తోంది. ఆమె పెద్ద కుమారుడు మహమ్మద్ ఆర్షద్​కు తన అరకొర సంపాదనలోనే రంగులు, పెన్నులు, స్కెచ్​లు, పెయింటింగ్ పేపర్లు కొనిస్తోంది. ఆర్షద్ వేసిన చిత్రాలను స్నేహితులు, ఉపాధ్యాయులు చూసి అభినందిస్తున్నారు.

పిల్లల్లో చిత్రలేఖన ప్రతిభను గమనించిన ఉపాధ్యాయులు వారిని మరింత ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ పోటీలు జరిగినా ఆదర్శ పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి సంపాదించుకోవాల్సిందేనని వారు చెబుతున్నారు. ఆర్షద్ కేవలం పది నిమిషాల్లోనే ఉపాధ్యాయుల చిత్రాలు గీస్తున్నాడు.

ఆర్షద్​ని ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా చిత్రలేఖనంలో ప్రతిభ చూపుతున్నారు. ఆ పాఠశాలలోని ఆర్షద్ లాంటి ఎంతో మంది విద్యార్థులున్నారు. వారిపై శ్రద్ధ తీసుకొని.. ప్రత్యేక శిక్షణ ఇస్తే... మట్టిలో మాణిక్యాల్లాగా.. ఈ పల్లెలో నుంచే చిత్రలేఖనంలో మంచి కళాకారులను తయారు చేయవచ్చు.

ఇదీ చదవండి:

గుంతకల్లులో యాంకర్ రష్మీ సందడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details