ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ సభ్యులు చైర్మన్ బాబురావు రెండు రోజులుగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా గురువారం ఆయన నగరంలో ఇవాళ రాజ్యాంగాన్ని బహూకరిస్తున్న అంబేద్కర్ చిత్రపటం దగ్గర సెల్ఫీ స్పాట్ ను ప్రారంభించారు. అనంతరం రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధిని చూసి దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇటు వైపు చూస్తున్నాయని చెప్పారు. పరిపాలనలో ఉన్న సంస్కరణలు పరిశీలించేందుకు కమిటీని ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లాలో పర్యటించిన రెండు రోజులు అన్ని శాఖల్లోనూ ప్రజా సంక్షేమ అభివృద్ధి కనబడుతోందని అన్నారు. పరిపాలన అంశంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సేవలు అభినందనీయమని కొనియాడారు.
అనంతపురంలో సెల్ఫీ పాయింట్ ప్రారంభం... - ananthapuram district newsupdates
రాజ్యాంగం ద్వారా ఎంతో ఎంతో లబ్ధి పొందినా.. నేటికీ సామాజిక రుగ్మతలు, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని.. ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమిటీ సభ్యుడు చైర్మన్ బాబురావు అన్నారు. రెండు రోజులుగా ఆయన అనంతపురం జిల్లాలో పర్యటించారు. రాష్ట్రంలో సీఎం జగన్ సామాజిక సంస్కర్తగా.. రాజనీతిజ్ఞుడిగా పని చేస్తున్నారని కొనియాడారు.
రామ్ నగర్ బ్రిడ్జ్.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిగా నామకరణం