అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం, మండల పరిధిలో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిస్తోంది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారికి అడ్డంగా పడిపోయాయి. అంబేడ్కర్ నగర్, పోరాట కాలనీ, పాతకోట, తదితర లోతట్టు కాలనీలలో ఉన్న ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. మండల వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, పెన్నా నది జలకలను సంతరించుకుంది. పెన్నానది ప్రవాహాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
తాడిపత్రిలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, పెన్నా నది కళకళలాడుతోంది.
తాడిపత్రిలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం