అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లోని డీఆర్ఎం కార్యాలయం వద్ద రైల్వే డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. తాము ఉద్యోగం చేస్తున్న డివిజన్లో పనులు కల్పించకుండా.. మరో డివిజన్లో విధులు నిర్వర్తించమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు వారు అంగీకరించకపోతే.. సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. న్యాయం చేయాలని దాదాపు మూడు గంటల పాటు నిరసన చేశారు. రైల్వే డివిజన్ మేనేజర్ ఆలోక్ తివారి వచ్చి.. రైల్వే డ్రైవర్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అదనపు విధుల గురించి ఇతర డివిజన్లలోని అధికారులతో చర్చిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
గుంతకల్లులో రైల్వే డ్రైవర్ల నిరసన - Railway drivers protest news
అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్లోని డీఆర్ఎం కార్యాలయం వద్ద రైల్వే డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. డివిజన్ మేనేజర్ ఆలోక్ తివారి వారితో మాట్లాడి.. ఆందోళన విరమించేలా చేశారు.
ఆందోళన చేస్తున్న రైల్వే డ్రైవర్లు