ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫుడ్​ సేఫ్టీ పాటించలేదని జరిమానా... హోటల్ నిర్వాహకుల ఆవేదన - గుంతకల్లు తాజావార్తలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో విజిలెన్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలు పాటించని హోటళ్లు, ఫుడ్​ సెంటర్లపై జరిమానా విధించారు. కరోనా వేళ వ్యాపారాలు సరిగా సాగక ఇబ్బందులు పడుతున్న తాము.. వేల రూపాయలు జరిమానా కట్టేదెలా.. అంటూ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

food safety
విజిలెన్స్​ అధికారులు దాడులు

By

Published : May 27, 2021, 11:06 AM IST

అనంతపురం జిల్లా గుంతకల్లులో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. చిన్నహోటళ్లు, బేకరీ, ఫాస్ట్ ​ఫుడ్ సెంటర్లలో ఫుడ్​ సెఫ్టీని పరిశీలించారు. నిబంధనలు పాటించని దాదాపు 70కి పైగా ఆహార సంస్థలకు జరిమానా విధించారు. కరోనా కష్టకాలంలో వ్యాపారాలు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న తామకు.. జరిమానాలు వేస్తే ఎలా అంటూ మున్సిపల్​ కార్యాలయం వద్ద విజిలెన్స్ అధికారులతో మొరపెట్టుకున్నారు. ఆదాయం లేక అవస్థలు పడుతుంటే.. జరిమానాలు కట్టేదేలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

కర్భ్యూ​ కారణంగా రోజుకు నాలుగు గంటలు మాత్రమే వ్యాపారాల నిర్వహణకు అనుమతి ఉందని.. తమకు లాభం లేకున్నా హోటళ్లు నడుపుతున్నామని చెప్పారు. అలాంటి తమపై.. వేల రూపాయలు జరిమానాలు మోపటం సరైంది కాదంటూ వారంతా అధికారులను ప్రాధేయపడ్డారు. కానీ సిబ్బంది మాత్రం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని వెళ్లిపోయారు. ఈ దాడుల్లో ఫుడ్​ ఇన్​స్పెక్టర్ కరీముల్ల, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details