అనంతపురంజిల్లా మడకశిర మండలంలోని రేషన్ డీలర్లు... తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు. లాక్డౌన్ కాలంలో రెండు దఫాలుగా రేషన్ పంపిణీ చేసినా.. ఏడు విడతల కమీషన్‌కు గాను 2 విడతల కమీషన్ మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. ఆదాయం లేక కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని వాపోయారు.
'రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం కల్పించండి'
అనంతపురం జిల్లా మడకశిర మండలంలో రేషన్ డీలర్లు... లాక్ డౌన్ కాలంలోని కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా కాలం వరకు ప్రతి నెల రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో ప్రజలకు మొత్తం రేషన్ అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
ప్రతి డీలర్‌కు రూ.10 లక్షల బీమా, నామినీకి ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నవంబర్ నెల వరకు ప్రతి నెల రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో ప్రజలకు మొత్తం రేషన్ అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్డుదారుడి వేలిముద్రలతో కాకుండా వీఆర్వో లేదా గ్రామ సచివాలయ అడ్మిన్ వేలిముద్రల ద్వారా తాత్కాలికంగా రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి డీలర్‌కు నాణ్యమైన మాస్కులు, శానిటైజర్ అందించాలని కోరారు.
ఇదీ చదవండి మద్యం దుకాణాన్ని మూసివేయాలని మహిళల ఆందోళన