ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

protest : రోడ్లు నిర్మించాలంటూ... వైకాపా నేతల నిరసన - hindupuram latest news

రోడ్లు నిర్మించి, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... వైకాపా నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది.

రోడ్లు నిర్మించాలంటూ... వైకాపా నేతల నిరసన
రోడ్లు నిర్మించాలంటూ... వైకాపా నేతల నిరసన

By

Published : Sep 30, 2021, 4:17 PM IST

మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా హిందూపురంలో వైకాపా నేతలు ఆందోళన చేశారు. హిందూపురం - లేపాక్షి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కమిషనర్​కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఈ ప్రాంతానికి వచ్చి కమిషనర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశం జరుగుతున్నందున కమిషనర్ ఇక్కడికి రాలేరని పోలీసులు సర్ది చెప్పినా వినకపోవడంతో నిరసనకారులను పోలీసులు రెండో పట్టణ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details