పశ్చిమ బంగాలో వైద్యులపై దుండగుల దాడిని ఖండిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆందోళన చేపట్టారు. ఒకరోజు వైద్య సేవలు నిలిపివేస్తూ...నిరసన తెలియజేశారు. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా సేపు ఆసుపత్రుల ఎదుట పడిగాపులు కాస్తూ కూర్చున్నారు. ఫలితం లేకపోవటంతో రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పరుగులు తీశారు. దీంతో సర్కారు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడాయి.
వైద్యసేవలు నిలిపివేసిన ప్రైవేట్ ఆసుపత్రులు - anantha pur
అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఒకరోజు వైద్య సేవలను నిలిపివేస్తూ..ఆందోళన చేపట్టారు. పశ్చిమ బంగాలో వైద్యులపై దుండగుల దాడికి వారు నిరసన తెలిపారు.
వైద్యసేవలు నిలిపివేసిన ప్రైవేటు ఆసుపత్రులు