విద్యుత్ శాఖకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించే ఎస్.ఎస్.ఆర్ ధరలను పెంచాలని అనంతపురం జిల్లా కదిరి ఈఈ కార్యాలయం ఎదుట గుత్తేదారులు నిరసన చేపట్టారు. కూలీలకు చెల్లించే ధరలను పెంచిన విద్యుత్ శాఖ... తమకు చెల్లించాల్సిన ఎస్.ఎస్.ఆర్ ధరలను 50 శాతం తగ్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ధరలను పెంచాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఈఈకి అందజేశారు.
'విద్యుత్ గుత్తేదారులకు ఎస్.ఎస్.ఆర్ ధరలు పెంచాలి' - ananthapuram district concern
అనంతపురం జిల్లా కదిరిలో విద్యుత్ గుత్తేదారులు ఆందోళన చేశారు. ఎస్.ఎస్.ఆర్ ధరలను 50శాతం తగ్గించడంపై నిరసన వ్యక్తం చేశారు.
కదిరిలో విద్యుత్ గుత్తేదారుల నిరసన