అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల తహసీల్దార్ కార్యాలయంలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. ఏకంగా తహసీల్దార్‌తో పాటు 14 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒక్కసారిగా మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి, పీహెచ్‌సీకి వస్తుంటారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఇప్పటివరకు ఒక్క కేసు కుడా నమోదు కానీ బెలుగుప్పలో ఒక్కసారిగా 14 పాజిటివ్ కేసులు రావడంతో ఇటు ప్రజల్లో, అటు అధికారుల్లో అలజడి మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
బెలుగుప్పలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్ - 14 carona positive cases in belugappa
బెలుగుప్ప మండల తహసీల్దార్ కార్యాలయంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కానీ బెలుగుప్పలో ఒక్కసారిగా 14 పాజిటివ్ కేసులు రావటంతో ఇటు ప్రజల్లోనూ అటు అధికారుల్లోనూ అలజడి మొదలైంది.
బెలుగుప్పలో తహశీల్దార్ కు పాజిటివ్