అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం కుండపోతగా కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగుతున్నాయి. బొమ్మనహాల్ మండలంలోని వేదవతి హగరి, చిన్న హగరి నదులు సమీప గ్రామాల్లోని వాగులు వర్షపు నీటితో పరవళ్లు తొక్కాయి. భారీ వర్షంతో నీటి కుంటల్లో జలకళ కనిపిస్తుంది. ఖరీఫ్ పంట వేసేందుకు ఈ వర్షాలు ఎంతో ఉపయోగపడతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వర్షంతో వాగులకు జలకళ
వాగులు, చెరువులు, కుంటలు వరదనీటితో పరుగులు పెడుతుంటే... రైతన్న కంట ఆనందం కనిపిస్తోంది. ఖరీఫ్ పంటకు సాగు నీరు అందుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వర్షంతో వాగులకు జలకళ