అనంతపురం జిల్లా ముదిగుబ్బ జూనియర్ కళాశాల సమీపంలో గుర్తు తెలియని యువకుడు అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని గమనించిన స్థానికులు.. ముదిగుబ్బ పోలీసులకు సమాచారం అందించారు. కానిస్టేబుల్ నరేష్ అక్కడికి చేరుకుని అపస్మారకస్థితిలో పడివున్న యువకుడిని భుజాన వేసుకొని రహదారి పైకి తీసుకువచ్చి వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో యువకుడు ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.
SUICIDE ATTEMPT: యువకుడు ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు - safe
యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు అప్రమత్తమై ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడు.
police saves boys life