ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...ఐదుగురి అరెస్ట్ - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...ఐదుగురి అరెస్ట్
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు...ఐదుగురి అరెస్ట్

By

Published : Nov 15, 2020, 7:44 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మండలంలోని ఇస్లాపురం, వెంకట్ రెడ్డిపల్లి, తిమ్మాపురం గ్రామాలకు చెందిన కొందరు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావటంతో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి ఐదురుగు పరారవ్వగా మరో ఐదుగురిని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.42,388 నగదు, 3 చరవాణులు, 5 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అరెస్టు చేసినవారిని సోమవారం కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details