కరోనా మహమ్మారి బారినపడి కోలుకుని విధుల్లోకి వచ్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు, సీఐ, ఎస్సై ఇటీవల కొవిడ్ బారిన పడ్డారు. నలుగురు కానిస్టేబుళ్లు కోలుకుని నేడు విధులకు హాజరయ్యారు. వీరికి ఇన్ఛార్జ్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఖాజా హుస్సేన్లు స్వాగతం పలికారు. వైరస్ను జయించింనందుకు అభినందనలు తెలియజేశారు. త్వరలోనే సీఐ, ఎస్సైలు కూడా విధుల్లోకి రానున్నట్లు వారు తెలిపారు.
ఈ కానిస్టేబుళ్లు.. కరోనాను జయించారు.. విధులకు హాజరయ్యారు! - తాడిపత్రిలో కరోనాను జయించిన పోలీసులు
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ కరోనా బారిన పడిన కానిస్టేబుళ్లు కోలుకున్నారు. తిరిగి విధులకు హాజరయ్యారు. వారికి పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.
కరోనాను జయించి విధులకు హాజరైన కానిస్టేబుళ్లు
TAGGED:
corona winner police