ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో అక్రమ ఆయుధాలు సరఫరా ముఠా అరెస్ట్

illegal weapon suppliers Arrest: అక్రమ ఆయుధాల కేసులో అనంతపురం జిల్లా పోలీసులు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పది రోజుల క్రితం అనంతపురం జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర ఆయుధ సరఫరా ముఠాను పట్టుకున్నారు. గతంలో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు.

Illegal weapons
అక్రమ ఆయుధాలు

By

Published : Jan 7, 2023, 4:48 PM IST

illegal weapon suppliers Arrest: అక్రమ ఆయుధాల కేసులో అనంతపురం జిల్లా పోలీసుల విచారణలో పలు ఆసక్తికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. పది రోజుల క్రితం అనంతపురం జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర అక్రమ ఆయుధాలు సరఫరా చేసే ముఠాను పట్టుకొని ఆ తర్వాత నిందితులను రాయదుర్గం కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. అయితే ఈ కేసులో మరింత విచారణ చేసేందుకు ఆరుగురు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. సుమారు వారం రోజులపాటు వీరిని విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్​లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఆయుధాల తయారీ కేంద్రాల గురించి వీరు వివరాలు తెలిపారు. దీంతో అనంతపురం జిల్లా పోలీసులు అక్కడికి వెళ్లి రైడ్స్ నిర్వహించారు. దీనిపై గతంలో రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు.

ఈ క్రమంలో 04 పిస్తోల్స్, 02 తూటాలు, 02 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఆయుధాలను ఉగ్రవాదులకు విక్రయించినట్లుగా పోలీసుల విచారణలో చేరింది. దీంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని జిల్లా ఎస్పీ కోరినట్లు తెలిపారు. త్వరలో ఈ కేసు ఎన్ఐఏ విచారించనుందని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో 22 తుపాకులు, 97 తూటాలు, 31 కేజీల గంజాయి, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పోలీసుల చేసిన కృషిని డీజీపీ అభినందిస్తూ 25వేల రివార్డు కూడా ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details