వారాంతపు సెలవు అమల్లోకి రావడంతో... అనంతపురంలో పోలీసులు సంబురాలు చేసుకున్నారు. జిల్లా పోలీస్ అసోషియేషన్ అడ్హక్ కమిటీ సభ్యులు ఎస్పీ కార్యాలయం ఆవరణంలో మిఠాయిలు పంచుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎస్పీ సత్యయేసుబాబు, అడిషనల్ ఎస్పీ చౌడేశ్వరీలను కలసి మిఠాయిలు అందజేశారు. ప్రభుత్వం ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటుందని తాము ఊహించలేదని అసోషియేషన్ సభ్యులు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులపై ఒత్తిడి తగ్గించేలా... సీఎం తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని పోలీసుస్టేషన్లలో ఉన్న సిబ్బంది సంఖ్య... ఇతర సూచనల ఆధారంగా వారాంతపు సెలవులు నిర్ణయిస్తామని ఎస్పీ సత్యయేసు బాబు తెలిపారు.
సంబరాల్లో అనంతపురం జిల్లా పోలీసులు - week off to police
పోలీసులపై ఒత్తిడి తగ్గించేలా... సీఎం తీసుకున్న వారాంతపు సెలవు నిర్ణయంపై అనంతపురం జిల్లా పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
అనంతపురం జిల్లా పోలీసులు