మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ.. అనంతపురం జిల్లా హిందూపురం ఒకటో పట్టణ పోలీసులు అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసలైతే వాటిని వదిలించుకోవడం కష్టమని.. యువత అటువంటి వాటికి దూరంగా ఉండాలని నినాదాలు చేశారు.
'మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు' - హిందూపురం తాజా వార్తలు
మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ హిందూపురం ఒకటో పట్టణ పోలీసులు స్కూల్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత వాటికి దూరంగా ఉండాలంటూ నినాదాలు చేశారు.
మత్తుపదార్థాలకు బానిసలు కావద్దు
హిందూపురం పట్టణంలోని ఎస్డీజీఎస్ కళాశాల నుండి రహమత్ పురం కూడలి వరకు అవగాహన ర్యాలీ కొనసాగింది. రహమత్ పురం కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ బాల మద్దిలేటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు.
ఇదీ చదవండి: అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు రిమాండ్.. చంచల్గూడకు నిందితులు