ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పీఎల్టీయూ నాయకులు తమ ఇళ్లలోనే నిరసన చేపట్టారు. కరోనా మొదటి, రెండో దశల కారణంగా ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్ల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. పాఠశాలలు మూతపడటంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిరువ్యాపారులు, ఆటోడ్రైవర్లను ఆదుకుంటున్న ప్రభుత్వం.. తమ కష్టాలను పట్టించుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి: ప్రైవేటు ఉపాధ్యాయులు
అనంతపురం జిల్లాలో పీఎల్టీయూ నాయకులు ఇళ్లలోనే నిరసన చేపట్టారు. ప్రైవేటు ఉపాధ్యాయులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు ఉపాధ్యాయుల నిరసన