ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేట కొడవళ్లతో నరికి...వ్యక్తి దారుణ హత్య - anatapur

అనంతపురం జిల్లా సుద్ధకుంటపల్లి తండాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో నరికి చంపారు. ఘటన నిన్న రాత్రి జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

వేట కొడవళ్లతో నరికి...వ్యక్తి దారుణ హత్య

By

Published : Jul 10, 2019, 8:54 AM IST


అనంతపురం జిల్లా రామగిరి మండలం సుద్ధకుంటపల్లి తండాలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం...వడ్డే ఆనంద్ (35) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాత కక్షలు కారణం కావొచ్చనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

వేట కొడవళ్లతో నరికి...వ్యక్తి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details