అనంతపురం జిల్లాలో వర్షాలతో నష్టపోయిన పంట పొలాలు, ఇళ్లను మంత్రి శంకర్ నారాయణ, కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(chitravathi balancing reservoir) గేట్లు ఎత్తివేయడంతో ప్రాజెక్టు దిగువన ఉన్న.. లక్షుంపల్లి, గొడ్డుమర్రి గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. కదిరిలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మంత్రి పరిశీలించారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ వైకాపా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
నిండుకుండలా పేరూరు..
20ఏళ్ల తరువాత పేరూరు జలాశయం(peruru project) గేట్లు తెరిచి.. నీటిని దిగువకు విడుదల చేశారు. కర్ణాటకలో కుంభవృష్టి వర్షాలు కురవటంతో అక్కడి ప్రాజక్టులన్నీ నిండిపోయాయి. ఫలితంగా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయడంతో జిల్లాలోకి భారీగా ప్రవాహం వస్తోంది. దీంతో.. అప్పర్ పెన్నానదిపై నిర్మించిన పేరూరు జలాశయం నిండుకుండలా మారింది.