ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ గ్రామంలో ఉబికి వస్తున్న నీటి ఊట.. ఎందుకంటే.. - water coming out from land

దశాబ్దాల కల నెరవేరిందన్న ఆనందంలో మునిగిపోయిన ఆ గ్రామస్తులకు.. కొత్త సమస్య వచ్చి పడింది. భూమిలో నుంచి ఉబికి వస్తున్న ఊటతో.. వారి కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఉబికి వస్తున్న నీటి ధాటికి నివాసాలు కూలుతున్నాయి. ఇప్పటికిప్పుడు మరోచోటికి వెళ్లలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

గ్రామంలో ఉబికి వస్తున్న నీటి ఊట
గ్రామంలో ఉబికి వస్తున్న నీటి ఊట

By

Published : Nov 8, 2021, 10:41 PM IST

గ్రామంలో ఉబికి వస్తున్న నీటి ఊట
అనంతపురం జిల్లా కదిరి మండలం దిగువపల్లి వాసులు దినదినగండంగా కాలం గడుపుతున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా.. దిగువపల్లి సమీపంలో చెర్లోపల్లి జలాశయం నిర్మించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన జలాశయం నిర్మాణం పూర్తవడంతో దిగువ పల్లె వాసులు సంబరపడ్డారు. రిజర్వాయర్ కు జలకళ వచ్చాక.. దిగువపల్లి వాసులకు కొత్త సమస్య వచ్చిపడింది. రిజర్వాయర్ నిండుకుండలా ఉండడం వల్ల.. ఊటనీరు ఉబికి వస్తోంది. ఫలితంగా గ్రామంలోని మోటార్లు, చేతి పంపుల్లో నిరాటంకంగా జలధార ఎగసి పడుతోంది. ఈ నీరు పిల్ల కాలువలా ఊరి మధ్యలో పారుతుండటంతో.. వీధులన్నీ అపరిశుభ్రంగా మారి.. నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.

నీటి ఊట ఎక్కువవడం వల్ల.. ఇళ్లలోనూ నీరు చేరి గోడలు దెబ్బతింటున్నాయని, ఇప్పటికే రెండు నివాసాలు కూలిపోయాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. దారుల్లో ఎప్పుడూ.. నీరు నిల్వ ఉండటం వల్ల.. పిల్లలు, వృద్ధులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామస్థులు ప్రమాదాల బారిన పడ్డారు. నీటితో తడచిన మిద్దెలు ఎప్పుడు కూలుతాయోనన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా... పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని.. తమకు మరోచోట స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details