రాష్ట్రంలో అరాచక పాలన పెచ్చు మీరిపోతోందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ అన్నారు. వైకాపా ప్రభుత్వ అవినీతి, అరాచకాలు బయటపెడితే.. తెదేపా నేతలను కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వాటితో తెదేపా మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులను వినియోగించి పాలకపక్షంలో ఉన్న పెద్దలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడే స్థాయికి ప్రభుత్వం వెళ్లకూడదని పయ్యావుల కేశవ్ హితవు పలికారు.
కేసులు పెరిగిన కొద్దీ తేదేపా బలపడుతుంది: పయ్యావుల కేశవ్ - ananthapur political news
వైకాపా ప్రభుత్వ అరాచకాలను ఎదురించినందుకు తెదేపా నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెరిగే కొద్ది పార్టీ బలపడుతుందని అన్నారు.
payyavula kesav fires on ysrcp government