ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కౌంటింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు లేవు' - ఉరవకొండ

కౌంటింగ్ కేంద్రాలు వద్ద సరైన సదుపాయాలు లేవనీ.. వాటిని పరిశీలించి ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టాలనీ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు.

పయ్యావుల కేశవ్

By

Published : May 22, 2019, 2:56 PM IST

ఎన్నికల నిర్వహణలో భాగంగా 60 రోజుల పాటు హడావిడి చేసిన ఎన్నికల కమిషన్.. ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఎమ్మెల్సీ, ఉరవకొండ తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఉరవకొండ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం... ఏర్పాట్లలో ఉన్న లోపాలను ఎన్నికల పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ అంశాన్ని జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీలకు ఫిర్యాదు చేశానన్నారు. ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లో 200 మంది ఉండాల్సిన చోట కనీసం 50మంది నిల్చునేందుకూ స్థలం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రేపు శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందనీ.. అలాంటి ఘటనలేమైనా జరిగితే దానికి ఎన్నికల కమిషనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

పయ్యావుల కేశవ్

ABOUT THE AUTHOR

...view details