జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనంతపురంలో పర్యటించారు. జనసేన నాయకుడు టి.సి.వరుణ్ నాయనమ్మ ఇందిర మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకున్న పవన్ నేరుగా వరుణ్ ఇంటికి వెళ్లి ఇందిర భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అక్కడినుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున వరుణ్ ఇంటికి చేరుకున్నారు.
అనంతపురంలో పవన్ పర్యటన - janasena
అనంతపురంలో జనసేన అధినేత పవన్ పర్యటించారు. జనసేన నాయకుడు టి.సి.వరుణ్ నాయనమ్మ మృతి చెందటంతో వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
అనంతపురంలో పవన్