అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని స్వగ్రామంలో పూజలు నిర్వహించిన పరిటాల సునీత... తన భర్త రవీంద్ర ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2 నియోజకవర్గాల్లో తనకు, తన కుమారుడు శ్రీరామ్‌కు అవకాశం కల్పించాలని... ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు తెలిపారు.
రాప్తాడు బరిలో శ్రీరామ్..! - anantapuram politics
ఈ ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దింపాలని... తమ కుటుంబం, అభిమానుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు.
రాప్తాడు బరిలో శ్రీరామ్
రాప్తాడుతో పాటు మరో నియోజకవర్గం కేటాయించలేకపోతే... తన స్థానంలో శ్రీరామ్‌ను పోటీకి నిలపాలని అభిమానుల సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ అభ్యర్థనను అధినేతకు వివరిస్తామని... ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ముందుకెళ్తామని స్పష్టం చేశారు. తన తల్లి సునీత, సీఎం చంద్రబాబు నిర్ణయిస్తే తాను రాప్తాడు నుంచి బరిలో దిగుతానని శ్రీరామ్ చెప్పారు.