అనంతపురం జిల్లా హిందూపురంలోని నింకంపల్లి ప్రాంతానికి చెందిన సమ్రీన్, మహబూబ్పాషా దంపతులు నెల రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా.. ఆ చిన్నారిని సమీప బంధువులకు రూ.20 వేలకు విక్రయించారు. బిడ్డ కనిపించకపోవటాన్ని గమనించిన స్థానికులు ఆ దంపతులను నిలదీయగా... శిశువును విక్రయించినట్లు అంగీకరించారు.
హిందూపురంలో దారుణం.. మగశిశువును విక్రయించిన తల్లిదండ్రులు - ananthapuram district crime
అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి ఆ చిన్నారిది. తండ్రి లాలనకూ నోచుకోని దుస్థితి ఆ శిశువుది. తల్లిదండ్రుల సంరక్షణలో హాయిగా ఎదుగుతున్న ఆ పసివాడిపై ఆర్థిక ఇబ్బందుల రూపంలో విధి పగబట్టింది. మగశిశువును భారంగా భావించిన తల్లిదండ్రులు ఆ చిన్నారిని రూ.20వేలకు విక్రయించారు. ఆర్థిక ఇబ్బందులు ఎంతటి ఘాతుకానికైనా దారి తీస్తుందన్నడానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
మగశిశువును విక్రయించిన తల్లిదండ్రులు
విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు దంపతులను విచారించి, బెంగళూరులో ఉన్న శిశువును తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. శిశువు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇదీచదవండి.