అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆక్రమణల తొలగింపు వివాదానికి దారి తీసింది. పట్టణంలోని అంజుమన్ కూడలి వద్ద నరేంద్ర అనే వ్యక్తి ఇంటిముందు ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీ సాయంతో మున్సిపాలిటీ అధికారులు తొలగించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కట్టడాలను కూల్చివేస్తున్నారని ఇంటి యజమాని, భాజపా కార్యకర్త నరేంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతణ్ణి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... మైరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు.
ఆక్రమణల తొలగింపులో వివాదం..ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం - elimination of encroachments
రాజకీయ కక్షతోనే తన ఇంటి ముందున్న కట్టడాలను కూల్చివేయిస్తున్నారని భాజపా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది.
ఆక్రమణల తొలగింపులో వివాదం