Bike Accident: అనంతపురం శివారు కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. కళ్యాణదుర్గం రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడగా స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన పవన్ కుమార్ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రాంగ్‌రూట్‌లో వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ని ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి :