కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడాదిన్నర వయసున్న చిన్నారని మృతి చెందింది. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బాధితులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారిని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని జన్మదిన వేడుకలు ముగించుకొని అర్ధరాత్రి సమయంలో స్వగ్రామం కంబదూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
కారు, లారీ ఢీ.. చిన్నారి మృతి, నలుగురికి తీవ్రగాయాలు - కల్యాణదుర్గం రోడ్డు ప్రమాదం
కారు.. లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదం అనంతపురం జిల్లాలో జరిగింది.
one and half year baby died in road accident in kalyanadurgam