ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండెపోటుతో వృద్ధురాలు మృతి

గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో ఓ వృద్ధురాలు మృతి చెందింది. అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

old women died with Hartack in bus at uravakonda Anantapur
గుండెపోటుతో వృద్ధురాలు మృతి

By

Published : Oct 3, 2020, 8:09 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం గుంతకల్లుకు చెందిన లక్ష్మీదేవి అనే వృద్ధురాలు గుండెపోటుతో ఆర్టీసీ బస్సులో మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను.. కుమారుడు, కుమార్తె శుక్రవారం సాయంత్రం బస్సులో అనంతపురానికి తీసుకెళ్తున్నారు.

ఈ తరుణంలో ఉరవకొండ సమీపంలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కన్నతల్లి మరణాన్ని చూసిన కొడుకు, కుమారై కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం స్థానికుల సహాయంతో ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details