డబ్బుల కోసం.. 'భోజనంలో బల్లి పడింది'! - game
సులువుగా డబ్బు సంబాదించాలని ప్లాన్ చేసిన ఓ వృద్ధుడు.. క్రిమినల్ ఆలోచన అమలు చేశాడు. భోజనంలో బల్లి నాటకంతో హోటల్స్‌లో వీరంగం సృష్టించడం మొదలుపెట్టాడు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఓ హోటల్ యజమాని ఫిర్యాదుతో అసలు నిజం బయటపడింది.
డబ్బులు సంపాదించడానికి ఓ వృద్ధుడు అడ్డదారి తొక్కాడు. హోటళ్లలో కడుపునిండా తిని.. అందులోనే బల్లి వచ్చిందంటూ.. డబ్బులు వసూలు చేస్తున్న ఘటన.. అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. గుంతకల్లులో సుందర్ పాల్ అనే ఒక వృద్ధుడు.. ఇలాంటి పనులే చేస్తూ బెదిరింపులకు దిగడం.. డబ్బులు వసూలు చేయడం అలవాటు చేసుకున్నాడు. చివరికి.. ఓ హోటల్ యజమాని విషయాన్ని గుర్తించాడు. పోలీసులకు పట్టించాడు. వారి విచారణలో దందా వ్యవహారం పూర్తిగా బయటపడింది. కట్ చేస్తే.. తనకు బ్లడ్ కేన్సర్ అని.. ఓ కన్ను కనిపించదని సుందర్ పాల్ చెప్పగా.. చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.