No Response In Spandana Program :అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న స్పందనతో బాధితుల సమస్యలు తీరటం లేదు. పదుల సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు సమస్యలను పరిష్కరించకపోవటంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పేదల పట్టా స్థలాలను కూడా కబ్జాదారులు వదలటం లేదు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో దశాబ్దం క్రితం ఇల్లు నిర్మించుకున్న వారిపై బెదిరింపులకు దిగుతున్నా రెవెన్యూ అధికారులు చూస్తూ ఉంటున్నారే తప్ప.. పేదలకు అండగా నిలవలేకపోతున్నారు. విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు బాధితులకు న్యాయం చేయటంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి సమస్యలను ఏకరవు పెడుతున్నారు. స్పందనలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా బాధితుల కష్టాలు మాత్రం తీరటం లేదు.
spandana program issues : క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం..సమస్యలను పరిష్కరించే వేదికగా స్పందన కార్యక్రమాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే మాత్రం జిల్లా కలెక్టర్కు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం ఏ విధంగా ఉందో స్పష్టమవుతోంది. అనేక వ్యయ ప్రయాసలకోర్చి బాధితులు జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతుండగా.. మండల స్థాయిలోకి వెళ్లేసరికి ఆదేశాలు అమలు కావటం లేదు.
Spandana Program: జగనన్నకు చెప్పినా కానరాని స్పందన.. పదే పదే మొరపెట్టుకున్నా ప్రతిఫలం లేదని ధ్వజం
Spandana Program Application : కబ్జాదారులు వదలటం లేదు.. అనంతపురం గ్రామీణ మండలం ఉప్పరపల్లిలో 13 ఏళ్ల క్రితం 145 మంది పేదలకు సెంటున్నర చొప్పున ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఈ స్థలాల్లో దాదాపు 25 మంది ఇల్లు నిర్మించుకున్నారు. ఈ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆ స్థలంలో బోర్డు నాటాడు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు దారి లేకుండా పెద్ద గొయ్యి తీశాడు. ఆ గుంత దాటి ఇంటికి వెళ్లలేని పరిస్థితితో బాధితుల్లో కొందరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అక్కడి ఇల్లు తప్ప వేరే గత్యంతరం లేని వారు తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే భూమి తనదేనని చెబుతున్న వ్యక్తి రెండు సార్లు ఇళ్లు కూల్చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాల్సిన రెవెన్యూ అధికారులు ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారే తప్ప పరిష్కారం చేయటం లేదు.