రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఇవాళ చిత్తూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈనెల 31న కేరళ తీరాన్ని తాకిన పవనాలు ఈసారి చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు నుంచి విస్తరించాయి. మామూలుగా నైరుతి రుతుపవనాలు అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో ఏదో ఒకచోట నుంచి ప్రవేశిస్తాయి.
మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు సాగుతూ విస్తరించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు రాష్ట్రమంతా విస్తరించే అవకాశం ఉంది. ఈమారు సాధారణ స్థాయిలోనే వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు - నైరుతి రుతుపవనాల వార్తలు
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. చిత్తూరు జిల్లాలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
ఇదీ చూడండి..