ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలల విలీన కష్టాలు.. విద్యార్థులు ఎక్కడ కూర్చోవాలి?

ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేకపోవటంతో.. వరండాలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు.

new problems in schools merging at andhra pradesh
new problems in schools merging at andhra pradesh

By

Published : Nov 1, 2021, 6:01 PM IST

ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయాలనే.. ప్రభుత్వ నిర్ణయంతో కొత్త సమస్య మొదలైంది. గదుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అనంతపురం జిల్లాలోని మడకశిరలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో ఇదే పరిస్థితి ఎదురైంది. ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేకపోవటంతో.. పాఠశాల యథావిధిగా కొనసాగించాలని అధికారులు తెలిపారు.

అగళి మండలంలోని నందరాజనపల్లి, ఇరిగేపల్లి ప్రాథమిక పాఠశాలల్లోని 64 మంది విద్యార్థులను ఇరిగేపల్లి ఉన్నత పాఠశాలలకు తీసుకొచ్చి.. వరండాలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎస్​జీటీ ఉపాధ్యాయులు ఏ తరగతులకు బోధించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలలు విలీనం చేసినా.. ఖాళీ పోస్టుల్లో ఉపాధ్యాయుల భర్తీ, పాఠశాలల్లో అదనపు గదుల సమస్య వల్ల ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

బాణసంచా నిషేధంపై హైకోర్టు ఆదేశాలు కొట్టేసిన సుప్రీం

ABOUT THE AUTHOR

...view details