ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: ప్రభాకర్ చౌదరి - Anantapur Latest news

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని తెదేపా నేత ప్రభాకర్ చౌదరి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగుబలహీన వర్గాల ప్రజలకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Need to prepare for local body elections: Prabhakar Chaudhary
ప్రభాకర్ చౌదరి

By

Published : Dec 1, 2020, 3:27 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని... మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెదేపా శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే అండగా నిలిచారని గుర్తు చేశారు. బీసీలు లేనిదే తేదేపా లేదని పేర్కొన్నారు. కిందటి ఎన్నికల్లో వైకాపా తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో తెదేపాను అత్యధిక మెజార్టీతో గెలిపించి వైకాపాకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం పని చేయాలని సూచించారు. బడుగుబలహీన వర్గాల ప్రజలకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details