అనంతపురం జిల్లా రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయానికి వైకాపా నేతలు రాజకీయ రంగు పులుముతున్నారని ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండన్న ఆరోపించారు. ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించి స్థానికంగా పనిచేస్తున్న వారిని తొలగించేందుకు వైకాపా నేతలు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. దాదాపు ఐదు వందల మంది ముత్యాలమ్మ ఆలయం వద్ద జీవనోపాధి పొందుతున్నారని కొండన్న తెలిపారు.రెండున్నర దశాబ్దాలుగా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్న ఆయన.. ఆలయంలో ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా దోచుకోవటానికి సాహసించరని స్పష్టం చేశారు. సుప్రసిద్ధ ఆలయంలో వైకాపా పనిగట్టుకొని అప్రతిష్ఠ చేసేందుకు దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
'దయచేసి.. ముత్యాలమ్మ ఆలయం జోలికి రావొద్దు'
అనంతపురం జిల్లా నసనకోట ముత్యాలమ్మ ఆలయానికి వైకాపా ప్రభుత్వం రాజకీయ రంగు పులుముతోందని మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ఆలయ కమిటీ అధ్యక్షుడు కొండన్న మండిపడ్డారు. ఆలయంలో ప్రతిదీ పారదర్శకంగా ఉందని ఆయన తెలిపారు. రెండున్నర దశాబ్దాలుగా ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు.
'దయచేసి.. ముత్యాలమ్మ ఆలయం జోలికి రావొద్దు'