అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి.. సాయంత్రం రథోత్సవం కన్నులపండువగా జరిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించుకున్నారు. వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక పాటలతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి అలరించింది. ఉత్సవాలకు ఏటికేడు భక్తుల నుంచి ఆదరణ పెరుగుతోందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
నరసింహస్వామి ఉత్సవాల్లో అలరించిన సంగీత విభావరి - కల్యాణదుర్గం
కల్యాణదుర్గంలో కొనసాగుతున్న లక్ష్మీనరసింహస్వామి జయంత్యుత్సవాల్లో ఆధ్యాత్మిక సంగీత విభావరి అలరించింది. భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు.
నరసింహస్వామి ఉత్సవాల్లో అలరించిన సంగీత విభావరి