ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతలో అట్టహాసంగా నామినేషన్ల ప్రక్రియ

నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు, స్వతంత్రులు అనంతపురంలో నామినేషన్లు దాఖలు చేశారు.

అనంతలో అట్టహాసంగా నామినేషన్ల ప్రక్రియ

By

Published : Mar 25, 2019, 11:03 PM IST

అనంతలో అట్టహాసంగా నామినేషన్ల ప్రక్రియ
శింగనమల నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ కార్యకర్తలు, నాయకులమధ్య కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హాజరయ్యారు


కదిరి తెదేపా అభ్యర్థిగా కందికుంట వెంకటప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని నానా దర్గా నుంచి భారీ ర్యాలీ నిర్వహించి... నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఇదే నియోజకవర్గానికిఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున వజ్ర భాస్కర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు.

అనంతపురం పార్లమెంట్ వైకాపా అభ్యర్థిగా పి.డి.రంగయ్య నామినేషన్ దాఖలు చేశారు. అనంతపురం అర్బన్ వైకాపా అభ్యర్థిగా అనంత వెంకట్రామి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది కార్యకర్తులు హాజరయ్యారు.జనసేన పార్టీ అభ్యర్థిగా టి.సి. వరుణ్ నామినేషన్ దాఖలు చేశారు. జనసేన కార్యకర్తలు అభిమానులు... సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో ఆయన భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.

రాప్తాడు వైకాపా అభ్యర్థి ప్రకాశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీగా హాజరైన వైకాపా కార్యకర్తలు అడుగడుగునా....నీరాజనాలు పలుకుతూ తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ధర్మవరం నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శివనగర్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఇదీ చదవండి

తెదేపా ప్రచారానికి.. తరలిరానున్న జాతీయ నేతలు

ABOUT THE AUTHOR

...view details