పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా సాధన కోసం జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో నాయి బ్రాహ్మణులు ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. జిల్లాకు కావాల్సిన అన్ని సదుపాయాలు పుట్టపర్తిలో ఉన్నాయని నాయకులు తెలిపారు. విమానాశ్రయం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రైల్వే స్టేషన్, రాయలసీమలోనే పెద్దదైన బుక్కపట్నం చెరువు, వందల ఎకరాల ప్రభుత్వ భూమి జిల్లాకు కావాల్సిన అనేక వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీలకు మాధ్యమంగా ఉన్న పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. గణేష్ సర్కిల్ లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.
పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు నాయిబ్రాహ్మణుల ర్యాలీ
పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ నాయిబ్రాహ్మణులు ర్యాలీ చేశారు. పుర వీధుల్లో ప్రదర్శనగా వెళ్లారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పుణ్యక్షేత్రం, సత్యసాయి బాబా నడయాడిన ఈ ప్రాంతాన్ని సత్యసాయి జిల్లాగా ప్రకటించాలని గణేష్ సర్కిల్ లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.
పుట్టపర్తి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు నాయిబ్రాహ్మణుల ర్యాలీ