అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం ఉప్పార్లపల్లి గ్రామంలో రామకృష్ణ అనే రైతు వక్క తోటకు ఆకతాయిలు నిప్పటించారు. తనకున్న పొలంలో 500 వక్క మొక్కలు నాటి ఆరేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ఆకతాయిలు శోకాన్ని మిగిల్చారు. రాత్రి సమయంలో మొక్కలకు నిప్పంటించారు. దీంతో చాలా వరకు తోట అగ్నికి ఆహుతైంది. ఇంతకాలం చేసిన శ్రమంతా వృథా అయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఆరేళ్లు కాపాడితే ... ఆకతాయిలు నిప్పు పెట్టారు... - మడకశిర సమాచారం
అతనో రైతు. వక్క సాగు చేశాడు. ఆరేళ్లుగా తోటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. తీరా పంట చేతికొచ్చే సమాయానికి ఆకతాయిలు శోకాన్ని మిగిల్చారు. తోటకు నిప్పంటించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
ఆరెండ్లు కాపాడితే ... ఆకతాయిలు నిప్పు పెట్టారు...