ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సబ్సిడీ ఉల్లి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి - Subsidy Onion Center

తమది రైతు, ప్రజా ప్రభుత్వమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అనంతపురం రైతు బజార్​లో సబ్సిడీపై ఉల్లి అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

సబ్సిడీ ఉల్లి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి
సబ్సిడీ ఉల్లి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి

By

Published : Oct 25, 2020, 12:30 AM IST

అనంతపురం రైతు బజార్​లో సబ్సిడీపై ఉల్లి అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. బహిరంగ మార్కెట్​లో రూ. 80 నుంచి 100 రూపాయలు ఉల్లి ధర ఉందని పేర్కొన్నారు. పెరిగిన ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టించకూడదన్న భావనతోప్రభుత్వం కిలో ఉల్లి 40 రూపాయలకే అందిస్తుందని స్పష్టం చేశారు.

ఎవరికి కష్టం వచ్చినా..

ఏ ఒక్క వర్గానికి కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందన్నారు.

నిర్లక్ష్యం వద్దు..

కరోనా ప్రభావం తగ్గినప్పటికీ.. నిర్లక్ష్యం వద్దని కోరారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉల్లి కొనుగోలు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు.

ఇవీ చూడండి : మేం పెయిడ్ ఆర్టిస్టులమైతే.. మరి మీరెవరు ?: అమరావతి రైతులు

ABOUT THE AUTHOR

...view details