అనంతపురం జిల్లా కదిరి మండలం కె. బ్రాహ్మణపల్లి పంచాయతీ చెర్లోపల్లికి చెందిన జెరిపిటి ఆంజనేయులు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సహాయం కోరారు. బాధితుడి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే.. సీఎం సహాయ నిధి నుంచి పదిలక్షల రూపాయలు మంజూరు చేయించి ఆ చెక్కును బాధితుడికి అందించారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కాలేయ మార్పిడి చేయించుకోనున్నట్లు బాధితుడు తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి పది లక్షల సీఎం సహాయ నిధి చెక్కు - anantapur updates
అనంతపురం జిల్లాలో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయలు మంజురయ్యాయి. బాధితుడు తన సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు.
.సీఎం సహాయ నిధి