మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి - అనంతపురం జిల్లా రాయదుర్గం తాజా వార్తలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రా రెడ్డి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మొక్కలు నాటిన ప్రభుత్వ విప్
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ కృషి చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలోని తాళ్లకెర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా వైస్ ఛైర్ పర్సన్ కాపు భారతి, రాయదుర్గం అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.