ఈ నెల చివర్లో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటన చేయనున్నట్లు తెదేపా శ్రేణులు వెల్లడించారు. ఈనెల 29, 30 తేదీల్లో నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రెండ్రోజుల పాటు హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటన - నందమూరి బాలకృష్ణ వార్తలు
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ నెల చివరన రెండ్రోజులు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెదేపా శ్రేణులు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించనున్నట్లు చెప్పారు.
bala krishna
హిందూపురం కొవిడ్ ఆసుపత్రికి 55 లక్షల రూపాయలు విలువ చేసే వైద్య సామగ్రి, మెడిసిన్ కిట్లను బాలకృష్ణ వితరణ చేయనున్నారు. ఇదివరకే ఈ ఆసుపత్రికి 25 లక్షల రూపాయలు విలువ చేసే వెంటిలేటర్లను ఆయన అందజేశారు. నియోజకవర్గంలోని సమస్యలపై అధికారులు, తెదేపా కార్యకర్తలతో నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు- అంబికా లక్ష్మీనారాయణ, హిందూపురం తెదేపా నాయకుడు